పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

పోలీస్ స్టేషన్‌లో  రౌడీషీటర్లకు కౌన్సిలింగ్

వరంగల్: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనుల్లో భాగస్వాములైతే కఠిన చర్యలు తప్పవని మిల్స్ కాలనీ సీఐ మల్లయ్య హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ఆయన కౌన్సిలింగ్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సూచనలు చేశారు. ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిఘా ఉంటుందని, సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.