'17న ఎయిర్ పోర్టు నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో సర్వే'
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ముందడుగు పడిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రక్షణ శాఖ, ఎయిర్ పోర్టు అథారిటీతో కలిసి జాయింట్ వెంచర్‌గా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అందుకు ఈ నెల 17న క్షేత్ర స్థాయిలో సర్వే చేస్తామని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో జిల్లా వాసులకు మరింత ఉత్సాహం నింపినట్లయింది.