ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రత్యేక డ్రైవ్
ఆసిఫాబాద్ పురపాలక సంఘం 20వ వార్డులో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కింద ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళలకు తడి, పొడి, హానికర చెత్త వేరు చేయడం, దోమల నివారణకు స్ప్రేయింగ్, బ్లీచింగ్ చల్లి, హోమ్ కంపోస్టింగ్‌పై అవగాహన కల్పించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి హౌస్ ట్యాక్స్ ముందస్తుగా చెల్లిస్తే 5% రాయితీ ఉంటుందని తెలిపారు.