VIDEO: కేంద్రమంత్రి వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ
NLG: కేంద్రమంత్రి బండి సంజయ్ ఇవాళ చేసిన వ్యాఖ్యలపై MP చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. 'ఆయన ఉన్న హోదాను మర్చిపోయి కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టెలాగా మాట్లాడుతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ ఒక కులం, ఒక మతం ఓట్లతో గెలవలేదు' అని అన్నారు. రాష్ట్రానికి వచ్చే నిధుల కోసం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కృషి చేయాలని తెలిపారు. ఈ మేరకు X వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.