కాలువలోకి దూకిన యువకుడు
W.G: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద గల వంతెన పైనుంచి 20 ఏళ్ల యువకుడు శుక్రవారం యనమదుర్రు కాలువలోకి దూకినట్లు సమాచారం. సుమారు ఉదయం 10.25నిల ప్రాంతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. యనమదుర్రు బ్రిడ్జిపై తనతో తెచ్చుకున్న బ్యాగ్, పాదరక్షలను విడిచి కాలువలోకి దూకినట్లు సమాచారం. స్థానికులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు.