వేణుగోపాల స్వామికి వెండి కవచం బహుకరణ
CTR: చౌడేపల్లి మండలంలో వెలసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామికి చౌడేపల్లికి చెందిన గోపాల్ శ్రీరామ్ జగదీష్ కుటుంబ సభ్యులు స్వామివారికి రూ.2.10 లక్షల విలువ చేసే వెండి కవచాన్ని అందజేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు వారికి ప్రత్యేక తీర్థప్రసాదాలను స్వామివారి జ్ఞాపిక అందజేశారు.