VIDEO: 'సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తాం'

VIDEO: 'సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తాం'

SRPT: సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తామని డీసీసీబీ డైరెక్టర్, పీఏసీఎస్ ఛైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. శుక్రవారం తుంగతుర్తిలో రైతు సేవా సహకార సంఘం కార్యాలయం ముందు సహకార సంఘం వారోత్సవాల సందర్భంగా సంఘం జెండాను ఎగరవేసి మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సహకార సంఘం పని చేస్తోందన్నారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, సీఈవో యాదగిరి పాల్గొన్నారు.