VIDEO: డ్రైవర్ క్లీనర్ మధ్య వాగ్వాదం.. తగలబెట్టిన పెట్టిన స్కూల్ బస్సు
ప్రకాశం: అర్ధవీడు మండలంలోని పాపినేని పల్లి గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున కంభంకు చెందిన ఆల్ఫా స్కూల్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బస్సు డ్రైవర్ క్లీనర్‌కు జరిగిన వాగ్వాదంలో బస్సులో పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. అక్కడికి చేరుకున్న స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.