VIDEO: ప్రోటోకాల్ రగడ.. MLCల ఫోటోలు లేకపోవడంపై BJP ఫైర్
MNCL: నేడు జిల్లాలో నిర్వహించిన గ్రామసభలలోని ఫ్లెక్సీలలో బీజేపీ గ్రాడ్యుయెట్స్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, టీచర్స్ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య చిత్రపటాలను పెట్టకుండా ప్రోటోకాల్ ఉల్లంఘించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికి బీజేపీ ప్రజా ప్రతినిధులను అవమానించడమే అవుతుందన్నారు. దీనికి బాధ్యులైన అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.