సంబెపల్లి నల్లగంగమ్మ తల్లి జాతర పోస్టర్ ఆవిష్కరణ
అన్నమయ్య: చిన్నమండెం మండలం పడమటికోన గ్రామంలోని బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నల్లగంగమ్మ తల్లి జాతర మహోత్సవ పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. సంబేపల్లి మండలానికి తలమానకమైన ఈ జాతర ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ సుబ్బరాజు యాదవ్, డైరెక్టర్లు, ఆలయ సిబ్బంది, గ్రామ టీడీపీ నాయకులు, యువకులు పాల్గొన్నారు.