VIDEO: నాలుగేళ్ల చిన్నారిపై అమానుషం

VIDEO: నాలుగేళ్ల చిన్నారిపై అమానుషం

మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముంబైలోని ఓ హౌసింగ్ సొసైటీలో పాతకక్షల నేపథ్యంలో సందీప్ అనే వ్యక్తి నాలుగేళ్ల చిన్నారి విఘ్నేశ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ బాలుడిని ఆటోలో నుంచి లాగి తలను నేలకేసి కొట్టాడు. అంతటితో ఆగకుండా ఇనుపరాడ్డుతో బలంగా బాదాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విఘ్నేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.