పేకాట స్థావరంపై పోలీసుల దాడి

పేకాట స్థావరంపై పోలీసుల దాడి

KMR: గాంధారి మండలం పెద్ద పొతంగల్ 2లో శుక్రవారం పేకాట స్థావరంపై దాడి చేసి ఏడుగురిని పట్టుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. ఆకస్మిక తనిఖీలు చేస్తుండగా రహస్యంగా ఆడుతున్న వారిపై దాడి చేసి రూ. 5,885 నగదు, 6 మొబైల్ ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరొకరు చాకచక్యంగా తప్పించుకున్నారన్నారు.