VIDEO: ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు

VIDEO: ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు

అన్నమయ్య: మదనపల్లె మండలంలో శుక్రవారం ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ (62) మట్టి తరలింపు పనిలో ఉండగా బైపాస్ రోడ్డుపై ట్రాలీ డోర్ ఊడిపోవడంతో కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.