ఓటింగ్ కేంద్రాల్లో జరిగే భద్రత చర్యలపై సమీక్ష
KMM: జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం బోనకల్ మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లను పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో ఓటింగ్ కేంద్రాల్లో జరిగే ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సదుపాయాలు మొదలగు అంశాలను ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ... ఓటర్లు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి పోలింగ్ బూత్‌లో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.