సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై
KMM: రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కొనిజర్ల ఎస్సై సూరజ్ అన్నారు. డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమని తెలిపారు. సైబర్ నేరం జరిగిన వెంటనే https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.