విజయవాడలో వ్యక్తి అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు

విజయవాడలో వ్యక్తి అదృశ్యం పోలీసులకు ఫిర్యాదు

NTR: మతిస్థిమితం లేని ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మధుర నగర్‌లోని లక్ష్మణరావు అనే వ్యక్తి ఈనెల 3వ తారీకు నుంచి కనబడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కావున ఈ వ్యక్తి ఎవరికైనా కనబడిన యెడల గుణదల పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించాలని సీఐ వాసిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు.