12 యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహం..!
నంద్యాల కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. ఉత్పాదన, సేవా రంగాల్లో 12 యూనిట్లకు ఆర్థిక ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు వచ్చిన 868 దరఖాస్తుల్లో సింగిల్ డెస్క్ విధానం ద్వారా 846 యూనిట్లకు అనుమతులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.