ఫ్లై91 సేవలు ప్రారంభం

ఫ్లై91 సేవలు ప్రారంభం

AP: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు కొత్తగా ఫ్లై91 విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు శ్రీకాకుళంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి రావడం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణించే వారికి టైమింగ్స్ విషయంలో మరింత వెసులుబాటు కలగనుంది.