పేలుడు ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
సత్యసాయి: కదిరి పేలుడు ఘటనలో నలుగురు మృతి చెందడంపై మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్లను ఆదేశించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. క్షతగాత్రులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.