గాయాల పాలైన జింకను కాపాడిన రైతు

CTR: గాయాల పాలైన జింకను రైతు కాపాడిన ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. పుంగనూరు, సోమల మండలం, ఇరికిపెంట పంచాయతీ మేటిమంది వద్దకు గాయాలపాలైన ఒక జింక వచ్చింది. గాయంతో ఉన్న జింకను చూసిన గ్రామవాసి చంద్ర దానికి ప్రథమ చికిత్స చేసి అనంతరం అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఘటన స్థలానికి సోమల బీట్ ఆఫీసర్ ప్రభాకర్ చేరుకుని జింకను స్వాధీనం చేసుకున్నారు.