అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ

ఖమ్మం: జిల్లాలోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో శాలివాహన వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అభాగ్యులకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం గురువారం రాత్రి నిర్వహించారు. పేద ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా ఈ ట్రస్ట్‌ను కుమ్మర కులస్తులంతా ఏకమై ఏర్పాటు చేసినట్లు ట్రస్ట్ బాధ్యులు తెలిపారు. ట్రస్ట్ ఛైర్మన్ నిడిగొండ నరేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.