VIDEO: పుట్టపర్తిలో ప్రధాని కాన్వాయ్ ట్రయల్ రన్
సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రేపు ప్రధాని మోదీ పుట్టపర్తికి రానున్నారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా పట్టణంలో కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. ప్రధాని రాకపోకల మార్గాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కారణంగా పట్టణంలో పలుచోట్ల ట్రాఫిక్‌ను మళ్లించారు. అధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.