'పరిసరాల పరిశుభ్రతను పాటించాలి'

MBNR: వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను శుభ్రంగాఉంచుకోవాలని మున్సిపల్ మాజీ ఛైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ప్రజలకు సూచించారు. ఆయన ఆదివారం వెంకటరమణ, తిరుమల కాలనీల్లో కొనసాగుతున్న డ్రైనేజీలు, సీసీరోడ్డు పనులను పరిశీలించారు. పనుల్లో నాణ్యతపాటించి త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.