9 గంటలకు 17.46 శాతం పోలింగ్
SRCL: జిల్లాలో ఎన్నికలు జరుగుతున్న 5 మండలాల్లో ఉదయం 9 గంటల వరకు 17.46 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. చందుర్తిలో 14.75, కోనరావుపేటలో 17.81, రుద్రంగిలో 18.20, వేములవాడలో 19.85, వేములవాడ రూరల్లో 18.03 శాతం నమోదైనట్లు వెల్లడించారు. అత్యధికంగా వేములవాడ అర్బన్ మండలంలో, అత్యల్పంగా చందుర్తి మండలంలో నమోదైంది.