'అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు'
WNP: అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వనపర్తి రూరల్ ఎస్సై హృషీకేశ్ హెచ్చరించారు. శనివారం రూరల్ పరిధిలోని చిమనగుంటపల్లి గ్రామ సమీపంలోని తూర్పు తాండ దగ్గర రెండు ట్రాక్టర్లలో(1.TS 31 T 5150/ TS 06 UA 5115,2.TG 32 T 2521/ TG 32 T 2522) డ్రైవర్లు నేనావత్ దూదేష్, నేనావత్ జగదీష్‌లు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా పట్టుకొని కేసు నమోదు చేశారు.