వ్యక్తిగత పరిశుభ్రత ద్వారానే వ్యాధుల నివారణ: కలెక్టర్

NLG: వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారానే వ్యాధులను అరికట్టవచ్చని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నల్గొండ పట్టణంలోని ఏఆర్ నగర్‌లో మంగళవారం అధికారులతో ఆమె పర్యటించారు. గత సంవత్సరం ఈ ప్రాంతం నుండి డెంగ్యూ కేసులు అధికంగా నమోదు కావడంతో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించేందుకు విచ్చేశారు. డ్రైనేజ్ సీస్టం, పారిశుద్ధ్య నిర్వహణను ఆమె పరిశీలించి సూచనలు చేశారు.