విజన్ లేదు.. ఓన్లీ కమీషన్లే రేవంత్ టార్గెట్ : హరీష్ రావు

TG: తమ బిల్లులు వెంటనే విడుదల చేయాలని వందలాది కాంట్రాక్టర్లు సచివాలయంలోని రేవంత్, భట్టి విక్రమార్క ఛాంబర్లను ముట్టడించిన ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదని కేవలం కమీషన్ల మీద మాత్రమే ఫోకస్ ఉందని ఆరోపించారు. గత రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు కాంట్రాక్టర్లు ధర్నా చేయడం.. ప్రపంచంలోనే మొదటిసారి కావచ్చన్నారు.