రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

రైలులో తరలిస్తున్న మాదకద్రవ్యాలు స్వాధీనం

BPT: రైలులో అక్రమంగా తరలిస్తున్న మాదక ద్రవ్యాలను ఈగల్ సెల్ బాపట్ల టీం సభ్యులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం బాపట్ల రైల్వే స్టేషన్ నుంచి పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో ఈగల్ సెల్, రైల్వే పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. రైలులో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.