భీమ్‌గల్ మున్సిపల్ ప్రజలకు శుభవార్త..!
NZB: భీమగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు అధికారులు తీపి కబురు అందించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంటి పన్నును ఏప్రిల్ 30, 2026లోపుముందస్తుగా చెల్లించే వారికి పన్నులో 5% రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ పురపాలక చట్టం-2019 ప్రకారంఈ అవకాశం కల్పించబడింది. పట్టణ ప్రజలుఈ గడువులోపు పన్ను చెల్లించి రాయితీ పొందాలని కమిషనర్ తెలిపారు.