శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత
RR: శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు జరిపిన తనిఖీల్లో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద నుంచి సుమారు రూ.25 లక్షల విలువైన సౌదీ రియాల్స్, యూఎస్ డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగుల్లో రహస్యంగా దాచి తరలిస్తుండగా పట్టుబడ్డాయి. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.