'శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలి'
SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను పలాస నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఇటీవల నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ మంగళవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా నిరంతరం కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.