యూరియా కొరతపై CM సమాధానం చెప్పాలి: మాజీ మంత్రి

యూరియా కొరతపై CM సమాధానం చెప్పాలి: మాజీ మంత్రి

AP: కూటమి ప్రభుత్వంలో అవినీతి పెరిగిందని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కీలక సమయాల్లో ఎరువులు అందించకుండా.. తర్వాత అందిస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. తమ ప్రభుత్వంలో RBKల ద్వారా రైతులకు అన్నీ సమకూర్చామని అన్నారు. యూరియా కొరతపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.