సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి

విశాఖ: సింహాచలం సింహాద్రి అప్పన్నను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్ ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వెంకట్రావు స్వాగతం పలికి కప్ప స్తంభం అలింగనం చేయించారు. బేడా మండపం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు నాదస్వరాల నడుమ వారికి వేద ఆశీర్వచనం అందజేశారు.