చెరువును తలపిస్తున్న అండాలమ్మ కాలనీ రహదారి

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని క్వారీ రోడ్డు నుంచి అండాలమ్మ కాలనీ వెళ్లే మూలమలుపు వద్ద రహదారిపై గుంతలు పడి వర్షం నీరు అక్కడే నిలిచి ప్రమాదకరంగా ఉంది. వాహనదారులు రాకపోకలు సాగించినప్పుడు నీటి లోపల ఉన్న గుంతలు కనిపించక అదుపుతప్పి పడిపోతున్నారు. నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.