నది తీర ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి: ఎమ్మెల్యే

KRNL: మంత్రాలయం నియోజకవర్గంలోని తుంగభద్ర నది తీరంలో ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సూచించారు. తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు లక్ష నుంచి లక్షన్నర క్యూసెక్కుల మేర నీటి విడుదల అయిన నేపథ్యంలో ఎవరూ కూడా నదిలోకి వెళ్లకూడదని ముఖ్యంగా పశువుల కాపారులు, చేపల వేటకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలన్నారు.