‘ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడమే తెలుసు’

TG: రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వానికి చిల్లర రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఇప్పటివరకూ రైతుల సమస్యలపై సమీక్ష చేయలేదని కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ఎరువులు బఫర్ స్టాక్ ఉండేవని, రైతులు ఎరువుల కోసం క్యూలో నిలబడలేదని ఆయన పేర్కొన్నారు.