జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..?
సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలకు రెక్కలు వచ్చాయి. డిమాండ్ పెరగడం మరియు ఉత్పత్తి తగ్గడంతో చికెన్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం డ్రెస్డ్ చికెన్ రూ.280 నుంచి రూ.290 వరకు, స్కిన్ లెస్ చికెన్ రూ.300 నుంచి 320 వరకు పలుకుతోంది. కేవలం వారం వ్యవధిలోనే ధరల్లో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. ఈ పెరిగిన ధరల వల్ల సామాన్యుడు చికెన్ కొనలేని పరిస్థితి నెలకొంది.