ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

ఆసుపత్రిని సందర్శించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు

JN: జనగామ జిల్లా వ్యాప్తంగా డెంగీ, మలేరియా వ్యాధులు వ్యాపిస్తున్న తరుణంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సౌడ రమేశ్ జిల్లా ఆసుపత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్యం, వసతుల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో బెడ్లు సరిపోక బయట వార్డులోనే వైద్యం చేస్తున్నారని, సరిపడా బెడ్స్ వేసి నాణ్యమైన మందులు అందించాలని డాక్టర్లను కోరారు.