కేజీబీవీలో సీట్ల భర్తీకి ధరఖాస్తుల స్వీకరణ
ASR: అరకులోయ కేజీబీవీలో ఆరు, ఏడు తరగతుల, ఇంటర్మీడియట్ సీట్ల భర్తీకి ధరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు ప్రిన్సిపాల్ ఝాన్సీరాణి తెలిపారు. ఆరవ తరగతిలో 40, ఏడవ తరగతిలో 1, ఇంటర్ మొదటి ఏడాదిలో 40, ద్వితీయ ఇంటర్‌లో 11 సీట్లు ఉన్నాయన్నారు. అర్హులైన వారు ధరఖాస్తులను ఏప్రిల్ 1 లోగా అరకులోయ కేజీబీవీ ఆఫీసులో అందించాలని పేర్కొన్నారు.