కనకదుర్గ అమ్మవారికి గాజుల అలంకరణ

కనకదుర్గ అమ్మవారికి గాజుల అలంకరణ

NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు గాజుల అలంకారంతో భక్తులకు దర్శనమిస్తున్నారు. కార్తీకమాసం రెండో రోజున జగన్మాతకు గాజుల అలంకారం చేయడం ఆనవాయితీగా వస్తోంది. అమ్మవారి మూలవిరాట్​తో పాటు ఉపాలయాలను వివిధ రంగుల గాజులతో.. సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ గాజులను దేవస్థానానికి దాతలు అందజేశారు.