జమ్మి చెడు జమ్ములమ్మ అద్భుత రూపం
GDWL: గద్వాల జిల్లా కేంద్ర సమీపంలోని జమ్మిచేడు క్షేత్రంలో వెలిసిన జమ్ములమ్మ అమ్మవారికి శుక్రవారం పురస్కరించుకుని ఆలయ అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలు, కృష్ణా జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారికి ఆకుపూజ, హోమం తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.