కుమారుడిని చంపిన తండ్రి

కుమారుడిని చంపిన తండ్రి

NLR: కుమారుడిని చంపిన తండ్రి ఘటన సోమవారం ఆత్మకూరు మండలం బట్టేపాడులో జరిగింది. స్థానిక దళితవాడకు చెందిన మామిడూరు పుల్లయ్యకు ఇవాళ పింఛన్ డబ్బులు వచ్చాయి. ఆ నగదు తనకు ఇవ్వాలని కుమారుడు మస్తానయ్య తన తండ్రితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో తన చేతిలోని కర్రతో కుమారుడిపై తండ్రి కర్రతో దాడి చేశారు. ఈ క్రమంలో గాయపడి అతను చనిపోయాడు.