VIDEO: జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
MNCL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి వద్ద ర్యాలీని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, డీఎంహెచ్‌వో డాక్టర్ అనిత పాల్గొన్నారు.