నూతన రహదారికి భూమిపూజ చేసిన టీడీపీ ఇంఛార్జ్
KRNL: హాలహర్వి మండలం నిట్రావట్టిలో నూతన రహదారి నిర్మాణానికి ఇవాళ టీడీపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతి భూమిపూజ చేశారు. ఈ నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని ఆమె తెలిపారు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను సులభంగా మార్కెట్లకు తరలించేందుకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.