VIDEO: MGM ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే
WGL: ఎంజీఎం దవాఖానలో మంగళవారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జనరల్ ఓపీ విభాగంలో రోగులకు అందుతున్న సేవలను పరిశీలించి, వైద్యులతో మాట్లాడారు. అనంతరం సూపరింటెండెంట్‌తో సమావేశమై దవాఖాన పరిస్థితులపై చర్చించారు. మెడిసిన్ విభాగంలో లోపాలపై ప్రణాళిక ఇవ్వాలని సూచించి, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.