కంచికచర్లలో శక్తి యాప్‌పై అవగాహన సదస్సు

NTR: కంచికచర్ల మండలం పరిటాల గ్రామాల్లో జిల్లా పరిషత్ పాఠశాలలో శక్తీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. శక్తీ టీమ్ ఏఎస్సై హనుమయ్య విద్యార్థులకు శక్తి యాప్ ఉపయోగాలు, సమాజంలో విద్యార్థులపై దాడులను ఎలా ఎదుర్కోవాలో వివరించారు. అనంతరం హనుమయ్య విద్యార్థులకు పలు సూచనలు చేశారు.