జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. జర్నలిస్టులకు గాయాలు

జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. జర్నలిస్టులకు గాయాలు

JGL: జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. BRS పార్టీలోకి ఆహ్వానించేందుకు కేటీఆర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఇవాళ ఆయన ఇంటికి వెళ్లగా.. కార్యకర్తల తోపులాటలో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. మీడియా ప్రతినిధుల కెమెరాలు ధ్వంసం కావడంతో ఆగ్రహించిన జర్నలిస్టులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. పరిస్థితి అదుపు తప్పడంతో అక్కడ గందరగోళం ఏర్పడింది.