VIDEO: ఐపీఎల్ బెట్టింగ్‌పై సీ.ఐ నరేష్ హెచ్చరిక

VIDEO: ఐపీఎల్ బెట్టింగ్‌పై సీ.ఐ నరేష్ హెచ్చరిక

KDP: జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్‌లో సీ.ఐ నరేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఐపీఎల్ నేపథ్యంలో బెట్టింగ్ నిర్వాహకులకు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఏప్రిల్ 23 వరకు జరిగే ఐపీఎల్‌ను అవకాశంగా తీసుకుని కొంతమంది మొబైల్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా అమాయకులను లక్ష్యంగా చేసుకుని బెట్టింగ్ దందా సాగించే అవకాశం ఉందని తెలిపారు. ఇలాంటి అక్రమాలకు దూరంగా ఉండాలన్నారు.