చేతికొచ్చిన వరి పంట దగ్ధం
NZB: తిమ్మాపూర్ గ్రామానికి చెందిన పేద రైతు దంపతులు విజయ,నరేష్‌కు చెందిన ఎకరం వరి పంట కుప్ప అగ్నికి ఆహుతైంది. కష్టపడి అప్పులు చేసి సాగు చేసిన పంట కోత కోసి పొలంలో కుప్ప వేయగా గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేసినట్లు రైతు దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టినిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.