'విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'
NRML: విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ సోహ్రాబ్జీ రాథోడ్ అన్నారు. కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అపరిచితులకు బ్యాంకు ఖాతా వివరాలను వెల్లడించవద్దని అనవసరమైన లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.